Home Page SliderTelangana

అరెస్టులకు భయపడేది లేదు, జైళ్లను రెడీ చేసుకోండి

ఎవరో వాట్సాప్ చేస్తే, బండి సంజయ్‌ను అరెస్టు చేయడం అక్రమమని కిషన్ రెడ్డి అన్నారు. అరెస్టులతో భయపెట్టలేరని, జైళ్లను సిద్ధం చేసుకోమని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. వచ్చే ఆరు నెలల్లో కేసీఆర్ కుటుంబం ఫామ్‌హౌస్‌కు చేరుతుందని, వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. ఏ ఆధారాలు లేకుండా రాజకీయ కక్షపూరిత చర్యతోనే ఈ అరెస్టు జరిగిందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అక్రమాలపై ప్రశ్నించినందుకే అరెస్టు చేసారన్నారు. హార్ట్ పేషెంట్ అయిన బండి సంజయ్‌ను టాబ్లెట్ కూడా వేసుకోనీకుండా అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేసి, క్షమాపణలు చెప్పాలన్నారు.