Home Page SliderTelangana

నాయకత్వమంటే ఇదిరా అని ప్రపంచానికి మోదీ చాటరన్న కిషన్ రెడ్డి

ప్రపంచ దేశాలకు భారతదేశం ఆశాదీపంలా కనిపిస్తోందన్నారు కేంద్ర కేబినెట్ మంత్రి జి కిషన్ రెడ్డి. G 20 గురించి తెలిసి తెలియకుండా మాట్లాడొద్దన్నారు. కరోనాతో ప్రపంచదేశాలు అతలాకుతలం అయితే మోదీ నేతృత్వంలో భారత దేశం మాత్రం ప్రపంచానికి దిశానిర్దేశం చేసిందన్నారు. G20 సమావేశాలతో దేశ సాంస్కృతిక వైభవం, జీవన విధానం, ప్రాచీన కళల గురించి ప్రపంచం చర్చించుకుంటుందన్నారు. G20 సమావేశాలు జరుగుతున్న నగరాల్ని గొప్పగా ముస్తాబు చేసి విదేశీ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తుంటే కొన్ని నగరాలు వాటికి దూరంగా ఉన్నాయన్నారు. ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ G20 సదస్సులో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

G20 సమావేశాలకు భారత్ అధ్యక్షత వహించడం ప్రపంచంలో దేశ గౌరవాన్ని మరింత పెంచిందని అన్నారు. ప్రపంచ దేశాలు భారత వైపు చూస్తున్నాయన్నారు కిషన్ రెడ్డి. “G 20 సదస్సుపై కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని… భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు జీ20 సదస్సు ఎంతో అవసరమన్నారు. మోదీ దేశ ప్రధాని అయ్యాక ప్రతీ రంగంపై దృష్టి సారిస్తున్నారన్నారు. దేశంలోని అన్ని రంగాలపై నరేంద్ర మోదీ మార్క్ ఉందన్నారు. దేశానికి సంబంధించిన అస్థిత్వం కొట్టొచ్చినట్లు కనపడేలా చేశారన్నారు. జాతీయరహదారులను ప్రారంభించిన సమయంలో వాజ్ పేయిని అందరూ విమర్శించారు. 70 వేల కోట్లు ఏ రకంగా నిధులు సమకూరుస్తారని వ్యగ్యంగా మాట్లాడారు. ఆ తర్వాత పదేళ్లపాటు జాతీయరహదారులను పట్టించుకోలేదు. 1993లో అమెరికాలో పర్యటించిన సమయంలో ఇలాంటి రోడ్లు మనదేశానికి వస్తాయా అనుకున్నానన్నారు. నార్త్ ఈస్ట్ లోని ప్రతీ రాజధానిని జాతీయ రహదారులతో అనుసంధానం చేశామన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవేస్, ఎక్స్‌ప్రెస్ హైవేలను నిర్మించామన్నారు. ప్రపంచంలో తక్కువ వ్యయంతో 5జీ అందుబాటులో ఉంది భారత్‌లోనే అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా తక్కువ రేటుకే 5జీ అందిస్తున్నామన్నారు.

భారత్‌లో అద్భుతమైన ఫారన్ పాలసీ ఉందన్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్దం సందర్భంగా భారత విద్యార్థులను తీసుకురావడంలో ఫారెన్ మినిస్ట్రీ ఏ విధంగా పనిచేసిందో గుర్తుంచుకోవాలన్నారు. 22వేల మంది విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి తీసుకురాగలిగామంటే మన విదేశాంగ మంత్రిత్వశాఖ గొప్పతనమేన్నారు. పాకిస్థాన్ వాళ్లు చంపేవాళ్లు… మనం చచ్చేవాళ్లమనే ఆలోచన గతంలో ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. పఠాన్‌కోట్ ఘటనకు ధీటైన సమాధానం చెప్పామన్నారు. ఇండోనేషియాలో G20 సదస్సు జరిగితే కేవలం దేశ రాజధాని బాలిలో మాత్రమే నిర్వహించారు. కానీ దేశంలోని అన్ని ముఖ్యమైన నగరాల్లో జీ20 సదస్సులు జరగాలని ఆలోచించిన వ్యక్తులు మోదీ, జయశంకర్ అన్నారు. ఇండియాలో 56 నగరాల్లో 250 సమావేశాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.