కాంగ్రెస్ పార్టీపై కిషన్ రెడ్డి ఫైర్
తెలంగాణ: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఎప్పుడు ఇస్తారని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. అలాగే రైతులతో పాటు రైతు కూలీలకు రూ.12 వేలు వెంటనే ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

