Home Page SliderNational

బొగ్గు,గనుల శాఖమంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

కేంద్రంలో మోదీ వరుసగా 3సారి ప్రధానిగా ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాగా అదే రోజు కేంద్ర కేబినెట్ కూడా ఏర్పాటయ్యింది. ఈసారి మోదీ కేబినెట్‌లో తెలంగాణా,ఏపీ ఎంపీలకు మంత్రి పదవులు దక్కాయి.ఈ నేపథ్యంలో తెలంగాణా నుంచి కేంద్ర బొగ్గు,గనుల శాఖమంత్రిగా కిషన్ రెడ్డి నియమితులయ్యారు. కాగా ఆయన ఈ రోజు ఢిల్లీలోని  తన కార్యాలయం శాస్త్రిభవన్‌లో బొగ్గు,గనులశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన తెలంగాణా అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.అయితే ముందుగా తన ఛాంబర్‌లో పూజలు నిర్వహించిన తర్వాత ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు కేంద్రహోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్  కూడా బాధ్యతలు స్వీకరించారు.