బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల బీజేపీ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు బీజేపీ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు కిషన్ రెడ్డి ఇవాళ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాగా అక్కడి నుంచి అసెంబ్లీ దగ్గరకు వెళ్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఆ తర్వాత బీజేపీ కార్యాలయంలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణా బీజేపీ నాయకులు,నేతలు హాజరయ్యారు.