కిషన్ రెడ్డి అరెస్ట్..ఆందోళనలో బీజేపీ శ్రేణులు
బాటసింగారం వైపుగా వెళ్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకుని ఆయనను అరెస్టు చేశారు. ఈ ఘటనపై బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద ఈ ఘటన జరిగింది. దీనితో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ నాయకులు ఈటల రాజేందర్, కొందరు కార్పొరేటర్ల హౌస్ అరెస్టులకు నిరసనగా కిషన్ రెడ్డి, రఘునందన్ రావు ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించడానికి వెళ్తుంటే వారి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు పోలీసులు. దీనితో రోడ్డుపైనే బైఠాయించిన వారిని వర్షం కారణంగా అదుపులోకి తీసుకుని వాహనాలు ఎక్కించారు. ఈ సందర్భంగా ‘రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందా? ఎమర్జెన్సీ విధించారా? నేనేమైనా తీవ్రవాదినా, ఉగ్రవాదినా? కేంద్రమంత్రి కాన్వాయ్‌నే అడ్డుకుంటారా?’ అంటూ మండిపడ్డారు కిషన్ రెడ్డి. నినాదాలు చేస్తున్న బీజేపీ కార్యకర్తలను కొందరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటన అనంతరం కిషన్ రెడ్డిని బీజేపీ కార్యాలయానికి తరలించారు పోలీసులు.