కిరణ్ అబ్బవరం పెళ్లి ముహూర్తం కుదిరింది..
నటుడు కిరణ్ అబ్బవరం, నటి రహస్య గోరక్ నిశ్చితార్థం కొన్ని నెలల క్రితం వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. నటుడు కిరణ్ అబ్బవరం, నటి రహస్య గోరక్ వివాహానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెలలో వీరి పెళ్లి జరగనుంది. తనకు కాబోయే భర్త కిరణ్ అబ్బవరం పుట్టినరోజును పురస్కరించుకుని రహస్య ఈ విషయాన్ని బయటపెట్టారు. ఆయనకు బర్త్‌డే విషెస్ చెబుతూ ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. రాజావారు రాణిగారు సమయం నుంచి నిశ్చితార్థమైన నాటివరకూ వీరిద్దరూ కలిసి దిగిన పలు ఫొటోలు, వీడియోలతో స్పెషల్ వీడియో క్రియేట్ చేసి దాన్ని అభిమానులతో పంచుకున్నారు. హ్యాపీ బర్త్‌డే కిరణ్ అబ్బవరం. దాదాపు 40 రోజుల్లో నిన్ను నా భర్త అనేందుకు ఆశగా ఎదురుచూస్తున్నా అని ఆమె క్యాప్షన్ జత చేశారు.