Home Page SliderNational

‘క’ సినిమాలో పోస్ట్‌ మ్యాన్‌ పాత్రలో కనబడనున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం

హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా సినిమా ‘క’. ఈ సినిమాకు సుజీత్, సందీప్ ఇద్దరు డైరెక్టర్లు కలిసి డైరెక్షన్ చేస్తుండగా.. కిరణ్ శ్రీమతి రహస్య గోరక్ పర్యవేక్షిస్తున్నారు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం సొంత బ్యాన‌ర్‌పై తీస్తున్న ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో పెద్ద రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుండి టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా.. తాజాగా ఈ షూటింగ్ ఆల్‌మోస్ట్ కంప్లీట్ చేసుకున్న‌ట్లు మేకర్స్ ప్ర‌క‌టించారు. మూవీ టీం నుంచి ఫొటోను షేర్ చేశారు. దీంతో ఈ మూవీని అక్టోబ‌ర్ చివ‌రి వారంలో విడుద‌ల చేయుటకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

మ‌రోవైపు ఈ సినిమాలో ఆయ్ చిత్రం ఫేం న‌య‌న్ సారిక స‌త్య‌భామగా నటిస్తున్నట్లు చిత్ర‌యూనిట్ పేర్కొంది. ఈ సినిమాలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిగా ఉన్న పాత్ర – పోస్ట్‌మాన్‌గా న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం సొంత బ్యాన‌ర్‌పై వ‌స్తున్న ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.