‘ప్రెగ్నెంట్’ వార్తలకు ఫొటోతో సమాధానమిచ్చిన ‘కైరా అధ్వాణీ’
క్రైరా అధ్వాణీ ‘ప్రెగ్నెంట్’ అంటూ రెండురోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తన కొత్త చిత్రం ‘సత్యప్రేమ్ కీ కహాని’ చిత్రం కోసం హీరో కార్తిక్ ఆర్యన్‌తో కలిసి ప్రమోషన్ల్‌లో పాల్గొన్న ఫొటోలో ఆమె బేబీ బంప్ కనిపించిందని నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే తన ప్రేమికుడు సిద్దార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకుంది కైరా. దీనితో మొదటి బిడ్డ పుట్టబోతోందంటూ వార్తలు వచ్చాయి. అయితే సినిమాలతో చాలా బిజీగా ఉంది కైరా అధ్వాణీ. మరో కొత్త ఫొటో షేర్ చేసి ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టింది. ‘లవ్ ఈజ్ ఎవర్ గ్రీన్’ అంటూ గ్రీన్ డ్రెస్‌తో, చక్కటి నడుముతో సన్నగా ఉన్న తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనితో ‘గుడ్‌న్యూస్ ఉందా.. దీదీ’ అని అడిగిన వారందరి నోర్లు మూతపడ్డాయి. ఆమె కొత్త చిత్రం ‘సత్యప్రేమ్ కీ కహాని’ జూన్ 29న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఆచిత్రంలోని పాటలు సంగీత ప్రియుల నోళ్లలో నానుతున్నాయి.