Home Page SliderNationalNewsSportsTrending Today

కింగ్ కోహ్లి మరో సరికొత్త రికార్డు..

ఐపీఎల్ 18 సీజన్‌లో తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయంలో కోహ్లి ఒక రికార్డు సృష్టించారు. ఈ ఇన్నింగ్స్‌తో కోల్‌కతాపై 1000 పరుగులు పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకూ 4 జట్లపై ఐపీఎల్‌లో 1000కి పైగా పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా నిలిచారు. చైన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌పై గత సీజన్‌లోనే 1000 పరుగులు పూర్తి చేసుకోగా, ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్‌పై కూడా ఈ ఫీట్ సాధించారు.