కింగ్ ఖాన్ ‘డంకీ’ ప్రత్యేకతలివే
పఠాన్, జవాన్ చిత్రాల వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో జోరుమీదున్న కింగ్ షారుఖ్ ఖాన్ డంకీ చిత్రంతో హ్యాట్రిక్ ఇవ్వడానికి సిద్దమయ్యాడు. డిసెంబర్ 21న రిలీజ్ కాబోతున్న డంకీ చిత్రానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. అవేంటో చూద్దాం..
రొటీన్ యాక్షన్ చిత్రాల అనంతరం చాలాకాలం తర్వాత షారుఖ్ హీరోగా వచ్చే కామెడీ-డ్రామా చిత్రం ఇది. ఈ ఏడాదిలో తన రెండు చిత్రాలు రూ. 1000 కోట్ల పైన సాధించినప్పటికీ షారుఖ్‌కు తృప్తి లేదట. ప్రేక్షకుల కోసం కాకుండా తన తృప్తి కోసం ఈ చిత్రంలో నటించానని తెలియజేశారు.

త్రీఇడియట్స్, పీకే, సంజు, మున్నాబాయి వంటి చిత్రాలు తీసిన అగ్రదర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ, షారుఖ్ ఖాన్‌తో తీస్తున్న తొలి సినిమా ఇది. కేవలం 75రోజులలో చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రానికి ప్రీపొడక్షన్ దశ నుండి విడుదలకు మాత్రం రెండున్నరేళ్లు పట్టింది. ఈ చిత్రం మొత్తం బడ్జెట్ కేవలం రూ.120 కోట్లు మాత్రమే.
ప్రభాస్ సలార్ చిత్రానికి పోటీగా ఈ చిత్రం ఒక రోజు ముందే రాబోతోంది. భారత సరిహద్దుల నుండి అక్రమంగా ప్రయాణించేవారిని పంజాబీలు డాంకీ ట్రావెల్ అంటారు. వారు దానిని డంకీ అని కూడా అంటారు. భారత్ నుండి వివిధ దేశాలు దాటి అక్రమంగా బ్రిటన్‌లోకి ప్రవేశించే స్నేహితుల కథే ఈ డంకీ. దీనితో ఈ పేరు పెట్టారు. ఈ చిత్రానికి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లు మొదటి రోజుకు రూ.5 కోట్లు జరిగింది.