Home Page SliderNationalNews Alert

బసవరాజు బొమ్మై ఆఫీసులో కింగ్‌ కోబ్రా

కర్ణాటక షిగాన్‌ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఒక అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కార్యాలయ ప్రాంగణంలో ఓ కింగ్‌ కోబ్రా కనిపించింది. బొమ్మై కార్యాలయానికి వచ్చిన కాసేపటికి కోబ్రాను గుర్తించిన కార్యకర్తలు, నాయకులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ పామును పట్టి, అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. కోబ్రా వల్ల ఎవరికీ ఏమీ కాకపోవడంలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.