రుషి సునక్‌ను ప్రధానిగా నియమించిన కింగ్ చార్లెస్ III
రిషి సునక్‌ను, కింగ్ చార్లెస్ III బ్రిటన్ ప్రధానిగా నియమించినట్లు ప్యాలెస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అవినీతి, అసమర్థ ఆరోపణలతో పదవి నుంచి బోరిస్ జాన్సన్ వైదొలిగిన తర్వాత బ్రిటన్ ప్రధాన మంత్రిగా లిజ్ ట్రస్ నిమియమితులైనా.. అస్తవ్యస్థ ఆర్థిక పద్ధతులతో ఆమె పదవి బాధ్యతలు చేపట్టిన ఆరు వారాల్లోనే రాజీనామా చేశారు. దీంతో బ్రిటన్ కొత్త ప్రధానిని ఎన్నుకోవాల్సి వచ్చింది. ట్రస్ రాజీనామా తర్వాత ప్రధాని రేసులో నేనున్నాంటూ ముందుకు వచ్చి.. సలఫమయ్యాడు భారత సంతతికి చెందిన రిషి సునక్. ప్రత్యర్థి పెన్నీ మోర్డాంట్ టోరీ ఎంపీల నుండి తగినంత మద్దతు పొందడంలో విఫలమవడంతో కన్జర్వేటివ్‌ల నాయకుడిగా రిషి ఎన్నికయ్యారు. ఇంగ్లాండ్ ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటున్న అతి పిన్న వయస్కుడిగా రిషి సునక్ చరిత్ర సృష్టించారు. ఇంగ్లాండ్ చరిత్రలో 200 ఏళ్ల రికార్డును బద్ధలుకొట్టాడు.

