Home Page SliderInternational

సౌత్ కొరియా జీపీఎస్‌ను అస్తవ్యస్తం చేసిన కిమ్

దక్షిణ కొరియాకు చెందిన జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్‌ను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అస్తవ్యస్తం చేశారు. దీనితో అక్కడి విమానాలు, ఓడల సర్వీసులకు అయోమయం ఏర్పడింది. రెండు రోజులుగా తమ సర్వీసులు సమస్యలు ఎదుర్కొంటున్నాయని దక్షిణ కొరియా పేర్కొంది. ఇలాంటి చర్యలు మానుకోవాలని, ఏదైనా ప్రమాదం జరిగితే ఉత్తర కొరియా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. గతంలో కూడా ఉత్తర కొరియా పంపించిన చెత్త బెలూన్ల కారణంగా తమ రాజధానిలో రెండు రన్‌వేలను మూసివేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ జీపీఎస్ విషయంపై యూఎన్ ఏవియేషన్ బాడీ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్‌కు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.