“మమ్మల్ని చంపేయండి”: ముద్రగడ
ఏపీ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా తన పేరును మార్చుకున్న తర్వాత సంచలన ఆరోపణలు చేశారు. కాగా తనను పవన్ కళ్యాణ్,జనసేన అభిమానులు బూతులతో ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇలా చేయడం కంటే మమ్మల్ని చంపించండి అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మేము అనాథలం..ఏపీలో కాపుల హక్కుల కోసం పోరాడలేని ఓ అసమర్థుడనని..చేతకానోడినని అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర,ఏపీ ప్రభుత్వాలు పవన్ చేతిలో ఉన్నాయి.కాబట్టి కాపులకు రిజర్వేషన్లు ఇప్పించాలని పద్మనాభం కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా,విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపైనా పవన్ ఆలోచించాలని ముద్రగడ పద్మనాభ రెడ్డి సూచించారు.