సీఐడీ అధికారులకు కిలారు రాజేష్ లేఖ
అమరావతి: తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్ సీఐడీ అధికారులకు లేఖ రాశారు. ఇవాళ ఉ.10 గంటలకు డాక్యుమెంట్లు తీసుకురావాలని నిన్న రాజేష్‌ను సీఐడీ ఆదేశించింది. అయితే.. దసరా పండగ తర్వాత డాక్యుమెంట్లు తీసుకొస్తానంటూ కిలారు రాజేష్ లేఖ రాశారు. ఇప్పటికిప్పుడు డాక్యుమెంట్లు సాధ్యం కాదని సమయం కోరుతూ లేఖలో పేర్కొన్నారు.
నైపుణ్యాభివృద్ధి కేసుకు సంబంధించి సోమవారం కిలారు రాజేష్ సీఐడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. తాడేపల్లిలోని సీఐడీ ఆర్థిక నేరాల విభాగం-2 (సిట్) కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు ఆయనను ప్రశ్నించారు.

