Home Page SliderTelangana

హైదరాబాద్‌లో బీజేపీ నేత కిడ్నాప్ కలకలం

హైదరాబాద్‌లో బీజేపీ నేత కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. కాగా బీజేపీ నేత తిరుపతి రెడ్డి హైదరాబాద్‌లో కిడ్నాప్‌కు గురైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన భార్య ఆల్వాల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో 5929 గజాల స్థలం విషయంలో ఆయనకు ప్రత్యర్థులతో వివాదం ఉన్నట్లు సమాచారం. కాగా తిరుపతి రెడ్డి స్వస్థలం జనగామ జిల్లా దుబ్బకుంట అని సమాచారం. అయితే ఆయన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఉంటున్నారు. తిరుపతి రెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాగా తిరుపతి రెడ్డి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.