లోకేశ్ స్పైసీ ట్వీట్‌కు ఖర్గే కౌంటర్
అమరావతి: పెట్టుబడుల అంశంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ చేసిన “స్పైసీ ట్వీట్” రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ట్వీట్‌కు కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఘాటు కౌంటర్ ఇచ్చారు.
లోకేశ్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఖర్గే తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ,
“అందరూ స్పైసీ ఫుడ్ ఇష్టపడతారు, కానీ వైద్యులు ఎప్పుడూ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలని సూచిస్తారు” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, కర్ణాటక ఆర్థిక పరిస్థితిని ప్రస్తావిస్తూ, “పొరుగువారి అప్పులు ఇప్పటికే రూ.10 లక్షల కోట్లకు చేరాయి. కేవలం ఏడాదిలోనే రూ.1.61 లక్షల కోట్లకు పైగా కొత్త అప్పులు చేశారు. రెవెన్యూ లోటు 2.65% నుండి 3.61%కి పెరిగింది” అని పేర్కొన్నారు.
ఈ ట్వీట్‌పై వైఎస్సార్సీపీ నేతలు స్పందిస్తూ, లోకేశ్ ట్వీట్‌కి ఇది సరైన సమాధానమని వ్యాఖ్యానిస్తున్నారు.
రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ లోకేశ్–ఖర్గే ట్వీటర్ వార్ పెట్టుబడుల అంశాన్ని మళ్లీ చర్చలోకి తెచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.