NewsTelangana

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఏర్పాట్లు

రాష్ట్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు  నేటితో ముగిశాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలోని గణేష్ విగ్రహాలు నిమజ్జన బాట పట్టాయి. ఈ మేరకు హైదరాబాద్ భారీ గణేషుడు కూడా నిమజ్జనానికి సిద్దమయ్యాడు. హైదరాబాద్‌లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి కూడా అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. రేపు ఉదయం ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర జగరనుంది. దీంతో అధికారులు ఈ శోభాయాత్ర కోసం ప్రత్యేక ఏర్పాట్లు  చేస్తున్నారు. దీని కోసం భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇక బాలాపూర్ వినాయకునికి ఈ రోజు కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పూజలు నిర్వహించారు.