గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాధుడు
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయ్. కీలక ఘట్టమైన ఖైరతాబాద్ గణనాధుడు గంగమ్మ ఒడికి చేరాడు. పంచముఖ గణేష్ భారీ విగ్రహం నిమజ్జనం పూర్తయ్యింది. ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర లక్డీకపూల్, టెలిఫోన్ భవన్ మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి నెక్లెస్ రోడ్ కు చేరింది. శోభాయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుంచి చెదురుమదరుగా వర్షం కురుస్తున్నా.. భక్తుల కోలాహలం మాత్రం తగ్గలేదు. ఖైరతాబాద్ గణనాధుడి నిమజ్జనం పూర్తి కావడంతో… ఇక తెల్లవారే సరికి నిమజ్జనం మొత్తం పూర్తి చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తుకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


