Andhra PradeshHome Page Slider

జనసేన-టిడిపి-బిజెపి కూటమి స్పిరిట్ ని దెబ్బతీస్తే ఖబడ్దార్..

జనసేన-టిడిపి-బిజెపి కూటమి స్పిరిట్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఖశ్చితంగా తన తగిన కఠిన చర్యలు తీసుకోబడతాయి అని జనసేన నేత నాగబాబు హెచ్చరించారు. కూటమి విజయాన్ని ఆసరాగా  తీసుకుని ఎవరైన సరే కూటమి స్ఫూర్తిని భంగపరిచేలా రాతలు రాస్తే ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు. వైసిపి ఇంకా పూర్తిగా చావలేదు, ఇంక బతికే వుంది. ఆ కోరల్లోంచి వచ్చే విషపు రాతలివి. వాటినెవ్వరు పట్టించుకోకండి. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, పురందేశ్వరి కలిసి ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఈ కూటమి ప్రతిష్టను దెబ్బతీయాలని వైసీపీ సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు..  కూటమికి‌ సంబంధించిన  మూడు పార్టీల అధినేతలు సమిష్టి, నిర్మాణాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలని ఎవరు రాసిన, స్ప్రెడ్ చేసిన ఆ సోర్స్ పట్టుకుని వారికి కఠిన శిక్షలు అమలయ్యేలా చేస్తాం…జాగ్రత్త. అంటూ వీడియో విడుదల చేశారు.