రైతు భరోసాపై కీలక అప్‌డేట్..
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమయ్యింది. ఈ సమావేశంలో సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అర్హులైన అన్నదాతల నుండి దరఖాస్తులు తీసుకోవాలని, సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా భూములను గుర్తించాలని ఈ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కోసం ఐటీ చెల్లింపు, భూమి పరిమితులతో సంబంధం లేకుండా రైతులందరికీ లబ్ది చేకూర్చాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
Breaking news: అసదుద్దీన్ పిటిషన్ పై విచారణ వాయిదా