ఏపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని గ్రామాల్లో త్రాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. ముందుగా వారికి త్రాగునీరు అందిస్తామన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడతామన్నారు. రాష్ట్రంలోని అటవీ సంపదను కాపాడుకుందామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు. మడ అడవుల పరిరక్షణపై దృష్టి పెట్టాలన్నారు.ప్రజా పంపిణీ,ఆహర భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అధికారులకు సూచించారు. సినీ పరిశ్రమకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా చూస్తామన్నారు. మరోవైపు ఏపీలోని పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకోవాలని డిప్యూటీ సీఎం వెల్లడించారు.