ఉదయ్ రిమాండ్ రిపోర్టులో వివేకా హత్యకేసుకు సంబంధించిన కీలక అంశాలు
ఎంపీ అవినాష్ అనుచరుడు ఉదయ్‌ను వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఉదయ్ రిమాండ్ రిపోర్టులో వివేకా హత్యకేసుకు సంబంధించి విస్తుపోయే అంశాలు వెల్లడయ్యాయి. ఈ హత్యలో ఆధారాలు చెరిపివేసేందుకు ఉదయ్ ప్రయత్నించాడని సీబీఐ తెలియజేసింది. హత్యరోజు ఉదయం నాలుగు గంటలకు ఉదయ్ తన ఇంట్లో లేడని, రోజంతా అవినాష్ ఇంట్లోనే ఉన్నాడని తెలిపారు. ఈవిషయాన్ని గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించారు. హత్య జరిగిన స్థలంలో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయ్ కలిసి ఆధారాలు చెరిపివేయడానికి ప్రయత్నించినట్లు సాక్ష్యాలున్నాయని తెలియజేశారు.