NewsTelangana

నిబంధనలు ఉల్లంఘిస్తున్న పబ్‌లపై ఎన్ని కేసులు పెట్టారు?

రాత్రి 10 గంటల తర్వాత పబ్స్‌లో ఎలాంటి సౌండ్స్ పెట్టకూడదని హైకోర్టు ఆదేశించింది.  రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి సౌండ్స్ పెట్టకూడదని తెలిపింది. సిటీ పోలీస్ యాక్ట్,సౌండ్ పొల్యూషన్  రెగ్యూలేషన్ ప్రకారం.. లౌడ్ స్పీకర్లకు  నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి అని స్పష్టం చేసింది. రాత్రి వేళల్లో లౌడ్ స్పీకర్లకు ఎటువంటి అనుమతి లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇళ్లు,విద్యాసంస్థలు ఉన్న ప్రదేశాలలో పబ్‌లకు ఎలా అనుమతినిచ్చారో చెప్పాలని సంబంధిత అధికారులను హైకోర్టు  ప్రశ్నించింది. అదే విధంగా ఏ అంశాలను పరిగణించి పబ్‌లకు  అనుమతి ఇచ్చారో తెలపాలని హైకోర్టు వివరణ కోరింది. దీనిపై తక్షణమే కౌంటర్ దాఖలు చేయాలని ఎక్సైజ్ శాఖకు తెలంగాణా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా పబ్‌లో రాత్రి పూట లిక్కర్ మాత్రమే సరఫరా చేయాలని తెలంగాణా హైకోర్టు పేర్కొంది.