Home Page SliderTelangana

నేడు తెలంగాణా కాంగ్రెస్ నేతల కీలక సమావేశం

తెలంగాణాలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. రాష్ట్రంలో అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో అధికార,ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.  కాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో తీవ్రదుమారం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణాలో ఇవాళ టీకాంగ్రెస్ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలలో నెలకొన్న పరిస్థితిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.  అయితే వీటిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శలను ఎలా తిప్పి కొట్టాలనే దానిపై టీకాంగ్రెస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఉచిత విద్యుత్‌పై పార్టీ స్టాండ్‌ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.