మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్
ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం కోరాపుట్‌లో జరిపిన కూంబింగ్‌లో హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో ఏకే 47 రైఫిల్స్, 117 డిటోనేటర్స్, విప్లవ సాహిత్యానికి చెందిన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ తెలిపారు. గతంలో హిడ్మా హతమైనట్లు వార్తలు వచ్చినా అది వాస్తవం కాదని తేలింది. అయితే అప్పట్నుంచి మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న హిడ్మా తాజాగా ఒడిశా పోలీసులకు చిక్కాడు చాలా కాలం పాటు కనీసం ఫోటో కూడా లేకుండా తిరిగిన నేపథ్యం హిడ్మాది. 5వ తరగతి వరకే చదువుకున్న హిడ్మా.. 25 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. ప్రస్తుతం అతడి వయస్సు 44 ఏళ్లు.


 
							 
							