వైజాగ్‌లో ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఘటనలో కీలక విషయాలు
వైజాగ్‌లోని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సతీమణి, కుమారుడి కిడ్నాప్ కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. కిడ్నాపర్లు బాధితుల నుండి దాదాపు 1.75 కోట్ల రూపాయలు వసూలు చేశారని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ కుమారుడు శరత్‌ని కట్టేసి, కత్తితో బెదిరించారని ఆయన ఇంట్లోని 15 లక్షల రూపాయలు తీసుకున్నారని, మరో 60 లక్షల రూపాయలు అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారని తెలిపారు. ఎంపీ భార్య జ్యోతిని కూడా కుమారునితో ఫోన్ చేసి పిలిపించారని, అనంతరం ఆడిటర్ జీవీని కూడా కట్టేసి బెదిరించి , కోటి రూపాయలు తెప్పించుకున్నారని వివరించారు. నిందితులు హేమంత్, రాజేశ్, సాయి ముగ్గురూ కారులో పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారని తెలిపారు. వారినుండి ఇప్పటివరకూ 86.5 లక్షలు రికవరీ చేశామన్నారు.

