Home Page SliderNational

మాజీ సీఎం సిద్ధరామయ్య గురించిన కీలకాంశాలు

కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు కీలకం మైసూర్
బీజేపీ, కాంగ్రెస్, జనతాదళ్-సెక్యులర్ మధ్య త్రిముఖ పోరు

కర్నాటకలో కాంగ్రెస్‌ అగ్రనాయకుల్లో సిద్ధరామయ్య ఒకరు. రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు మాజీ ముఖ్యమంత్రి కీలకంగా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్, జనతాదళ్-సెక్యులర్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 225 స్థానాలున్న అసెంబ్లీలో 2018 ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు, కాంగ్రెస్ 78, జేడీఎస్ 37 సీట్లు గెలుచుకున్నాయి.
ఎన్నికల అనంతరం జేడీఎస్‌తో పొత్తు పెట్టుకుని 2018లో కలిసి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019లో పొత్తు కుప్పకూలడంతో రెండు పార్టీలు ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగాయి.

సిద్ధరామయ్య గురించి ఐదు ప్రధాన అంశాలు

1) 1978లో మైసూర్ తాలూకా బోర్డుకు ఎన్నికై సిద్దరామయ్య రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1983 కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో లోక్ దళ్ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి మైసూర్‌లోని చాముండేశ్వరి నియోజకవర్గం నుండి గెలుపొందాడు.
2) సిద్ధరామయ్య తరువాత జనతా పార్టీలో చేరారు. 1985లో చాముండేశ్వరి సీటును నిలబెట్టుకున్నారు. 1994లో జనతాదళ్ టిక్కెట్‌పై, 2004లో జనతాదళ్ (సెక్యులర్) టిక్కెట్‌పై మళ్లీ గెలిచారు.
3) 2005లో సిద్ధరామయ్య జేడీ-ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. ఏడాది తర్వాత అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. 2007లో చాముండేశ్వరి ఉప ఎన్నికలో ఆయన విజయం సాధించారు.
4) సిద్ధరామయ్య రెండుసార్లు కర్నాటక ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2013 మేలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి బాదామి స్థానం నుంచి గెలిచారు. కానీ చాముండేశ్వరి నుంచి ఓడిపోయారు.
5) సిద్ధరామయ్య కురుబ సామాజిక వర్గానికి చెందినవారు. మైసూర్ విశ్వవిద్యాలయం నుండి సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. రాజకీయాల్లోకి రాకముందు లా ప్రాక్టీస్ చేశారు.