హత్యాచారకేసులో కీలక ఆధారాలు మిస్సింగ్..సీబీఐ
కోల్‌కత్తా ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు సీబీఐకి సవాళ్లు విసురుతోంది. ఈ ఘటన జరిగి నెలరోజులవుతున్నా ఏం తేలట్లేదు. బెంగాల్ పోలీసుల చేతుల్లోంచి, సీబీఐ చేతికి వచ్చిన ఈ కేసులో కీలక ఆధారాలు మిస్సయ్యాయని, దర్యాప్తు ముందుకు సాగట్లేదని సమాచారం. హత్య జరిగిన తర్వాత రోజు సెమినార్ హాల్ సమీపంలో రెస్ట్‌రూంను కూల్చేయాలని మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఆదేశించినట్లు తెలిసింది. అప్పుడే అవసరమైన సాక్ష్యాలు కనుమరుగు అయ్యాయని భావిస్తున్నట్లు తెలిపారు సీబీఐ అధికారులు. రెండు రోజుల క్రితమే డాక్టర్ తల్లిదండ్రులు కేసును నీరుగార్చడానికి పోలీసులు తమకు లంచం ఇవ్వజూపినట్లు ఆరోపించిన సంగతి తెలిసిందే.

