Andhra PradeshHome Page Slider

ఏపీలో వాలంటీర్ల ఉద్యోగాలపై కీలక నిర్ణయం

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై అనేక విమర్శలు, తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఈ ఉద్యోగాలపై కీలక అప్డేట్ వచ్చింది. గత ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్లు అనేక మంది వైసీపీ సర్కారు చెప్పిన ప్రకారం ఎన్నికల ప్రచారానికి రాజీనామాలు చేశారు. తిరిగ వైసీపీ అధికారంలోకి వస్తే వారినే జీతాలు పెంచి తీసుకుంటామని మాటిచ్చారు. అయితే ప్రభుత్వం మారిపోవడంతో వారి పరిస్థితి అయోమయంగా మారింది. ఇక రాజీనామా చేయని వారు కూడా తమ ఉద్యోగాలు ఉంటాయా.. లేదా అనే మీమాంసలో ఉన్నారు. వాలంటీర్ల వ్యవస్థనే రద్దు చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీ నేత  మంత్రి నిమ్మల రామానాయుడు ప్రెస్‌మీట్‌లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. రాజీనామా చేయని వాలంటీర్లను తిరిగి తీసుకోవచ్చని చెప్పారు. మొత్తం వాలంటీర్లపై సమగ్రసర్వే చేసి వారిని ఉద్యోగాలలో తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒకరకంగా రాజీనామా చేయని వారికి ఇది గుడ్‌న్యూస్ అని చెప్పాలి.