ఎయిర్ లైన్స్ ధరలపై కీలక నిర్ణయం..
భారతదేశంలో నడిచే విమానయాన సంస్థలకు కేంద్ర విమానయానశాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై విమానయాన సంస్థలు టికెట్ ధరలను ఇష్టారాజ్యంగా మార్చడానికి వీల్లేదని, నెలరోజుల ముందుగానే సమాచారం తెలియజేయాలని పేర్కొన్నారు. రాజ్యసభలో ఈ విషయంపై మాట్లాడుతూ ధరల నియంత్రణకు కొత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. 24 గంటలలో తమ టికెట్ రేట్లను మార్చుకునేందుకు వీలు కల్పించే 2010 నాటి నిబంధనను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇకపై ధరలు మార్చడానికి నెలరోజుల ముందుగానే తమ శాఖకు సమాచారం అందించాలని హెచ్చరించారు. ఈ ఆకస్మిక ధరల మార్పు వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.