Home Page SliderTelangana

తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాగా రాష్ట్రంలో పంచాయితీరాజ్ శాఖను పునఃవ్యవస్థీకరణ చేస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ మేరకు పంచాయితీరాజ్ శాఖలో కొత్తగా 4 ఛీఫ్ ఇంజనీర్,12 సర్కిల్ ఇంజనీర్,11 డివిజినల్ ఇంజనీర్,60 సబ్ ఇంజనీర్ పోస్టులను మంజూరు చేసింది. అలాగే తెలంగాణాలో DEEకి ఏడాదికి రూ.5 లక్షలు,EE కి రూ.25 లక్షలు, SE కి రూ.కోటి,ఛీఫ్ ఇంజనీర్‌కు రూ.2.5 కోట్లు,ENCకి రూ.5 కోట్ల వరకు మంజూరు చేసే అధికారం కల్పించింది.