ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం గ్రామ సచివాలయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సచివాలయాలలో జనాభా ప్రాతిపదికన సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. చిన్న, చిన్న గ్రామాలలో సచివాలయాలను 10 కి.మీ కంటే ఎక్కువ దూరం కంటే తక్కువ ఉండే గ్రామాలను దగ్గరలోని సచివాలయాల పరిధిలోకి చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. సచివాలయ శాఖ పంపిన ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇక వాటిని నాలెడ్జ్ హబ్‌లుగా మార్చాలని నిర్ణయించుకుంది. కృత్రిమ మేధ సహాయంతో ప్రజలను మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పారిశ్రామిక వేత్తలుగా మార్చాలని నిర్ణయించింది. ఈ దిశగా వారికి శిక్షణను అందించనుంది.

