కుంభమేళా ఘటనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..
మహా కుంభమేళా తొక్కిసలాట దుర్ఘటనకు యూపీ ప్రభుత్వం, అధికారులు బాధ్యత వహించాలంటూ అడ్వకేట్ విశాల్ తివారీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల పిల్ దాఖలు చేశారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించేలా యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని, అధికారుల నిర్లక్ష్యానికి చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఈ కేసు విచారణ తమ పరిధిలోకి రాదంటూ సీజేఐ బెంచ్ పిటిషనర్‌కు స్పష్టం చేస్తూ పిల్ కొట్టేసింది సుప్రీం కోర్టు. ఈ ఘటన దురదృష్టకరమైనదే అని, దీనిపై విచారణకు, అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలంటూ సీజేఐ సూచించారు. దీనితో పిటిషనర్ పిల్ వెనక్కి తీసుకున్నారు. కుంభమేళాలో మౌని అమావాస్య నాడు అమృత స్నానాల కోసం త్రివేణి సంగమం వద్ద జనవరి 29న జరిగిన భారీ తొక్కిసలాటలో 30 మందికి పైగా భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే.