Home Page SliderTelangana

ఆ స్కూల్ మాత్రం కూల్చకండి..

హైడ్రా చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్యాంక్ బండ్ బఫర్ జోన్ లో ఉన్న నెక్లెస్ రోడ్ ని కూడా కూల్చి వేస్తారా అని నిలదీశారు. అయితే.. సలకం చెరువులో ఒవైసీ ఎడ్యుకేషన్ స్కూల్ నిర్మాణం చేపట్టారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై ఆయన స్పందించారు. తనపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించుకోవచ్చని, ఆ స్కూల్ ని మాత్రం కూల్చవద్దని ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు. పేదలకు ఉచిత విద్యను అందించేందుకే 12 భవనాలను నిర్మించానని చెప్పుకొచ్చారు. వీటిని ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుగా చూపిస్తున్నారని చెప్పారు. గతంలో తనపై కాల్పులు జరిగాయని, ఇప్పుడు కూడా కావాలంటే మళ్లీ అలా దాడి చేసుకోవచ్చని అన్నారు.