తెలంగాణ దావోస్ ఒప్పందాలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన, ఒప్పందాలపై బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కంపెనీలను దావోస్ తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్ చేసుకోవడం ఏమిటో అర్థం కావట్లేదన్నారు. కేవలం కాగితాలకే ఒప్పందాలు పరిమితం కావొద్దు. నిజమైన పెట్టుబడులు వచ్చి అభివృద్ధి జరిగిందంటే సంతోషమే అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు వేరే రాష్ట్రానికి వెళ్లిపోతున్నారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో నుంచి బయటికి వద్దామనుకుంటున్నారు. వారు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కి వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ వేధించని పారిశ్రామికవేత్త లేరు అంటూ కిషన్ రెడ్డి విమర్శించారు.

