Home Page SliderNationalPolitics

ఓటర్ల జాబితాపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

బీజేపీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్ల జాబితాను తారుమారు చేయాలని కుట్ర చేస్తోందంటూ ఆప్ నేత కేజ్రీవాల్ ఈసీకి ఫిర్యాదు చేశారు. న్యూఢిల్లీ నియోజక వర్గానికి చెందిన ఓటర్ల జాబితాను బీజేపీ తారుమారు చేసిందని ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా ఓట్లు చేర్చుకుంటున్నారని పేర్కొన్నారు. వారికి డబ్బులు పంపిణీ చేసే కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ భారీగా అక్రమ నిధులు ఇంట్లో దాచుకున్నారని, అధికారులు సోదాలు చేయాలని కోరారు. బీజేపీ నుండి మాజీ ముఖ్యమంత్రి వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుండి మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్‌లు, ఈ స్థానం నుండే కేజ్రీవాల్‌పై పోటీకి దిగుతున్నారు. దీనితో ఈ స్థానం ప్రతిష్టాత్మకంగా మారింది. దీనితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా స్పందిస్తూ బిహార్, యూపీ నుండి వచ్చి ఢిల్లీలో స్థిరపడిన వలస ప్రజలను నకిలీ ఓటర్లని కేజ్రీవాల్ అవమానిస్తున్నారని మండిపడ్డారు.