Home Page SliderInternationalPolitics

యూఎస్ మిలటరీలో కీలక మార్పులు..వారికి ప్రవేశం లేదు

యూఎస్‌లో కొత్తగా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మిలటరీ విషయంలో కీలక మార్పులు చేయనున్నారు. ట్రంప్ నిర్ణయం ప్రకారం మిలటరీలో ట్రాన్స్‌జెండర్లకు ప్రవేశం లేకుండా చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్నవారిని కూడా తొలగించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. దీనితో వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం దాదాపు 15 వేలమందికి పైగా ట్రాన్స్‌జెండర్లు మిలటరీలో పనిచేస్తున్నారు. గతంలో కూడా ట్రంప్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ట్రాన్స్‌జెండర్లు సాయుధ దళాలలో చేరకుండా చట్టం చేశారు. అయితే ఉన్నవారిని తొలగించలేదు. ఇటీవల అమెరికా ఉపాధ్యక్షునిగా ఎన్నికైన జేడీ వాన్స్ కూడా కళాశాలలో ప్రవేశం కోసం కొందరు టీనేజర్లు లింగమార్పిడి చేయించుకుంటున్నారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.