తెలంగాణ గ్రూప్-3పై కీలక ప్రకటన
తెలంగాణలో గ్రూప్-3 పరీక్షల నిర్వహణపై సీఎస్ శాంతికుమారి కీలక ప్రకటన చేశారు. ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, 1401 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. పరీక్షలను సక్రమంగా, సజావుగా నిర్వహించేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్దనున్న జిరాక్స్ సెంటర్లను మూసివేస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు దగ్గరలో సెక్షన్ 144 అమలు చేయనున్నారు. గ్రూప్-3కి రాష్ట్రవ్యాప్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.