Home Page SliderInternationalPolitics

సింగపూర్‌తో తెలంగాణ కీలక ఒప్పందాలు

సింగపూర్ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న స్కిల్ యూనివర్సిటీ కోసం సింగపూర్ ప్రభుత్వ ఆధీనంలోని ఐటీఈ సంస్థతో ముఖ్యమైన ఎంఓయూ కుదుర్చుకుంది. విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణను ఇచ్చి ఉద్యోగ అవకాశాలు పెంపొందించాలనే ఉద్దేశంతో పలు నైపుణ్య కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎనర్జీ రంగంలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు తగిన మార్పుల గురించి చర్చిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను అన్వేషిస్తున్నారు. అక్కడి విదేశాంగ మంత్రితో సమావేశమై మౌలిక వసతుల అభివృద్ధి, ఇంధనం, గ్రీన్ ఎనర్జీ, పర్యాటక రంగం వంటి విభాగాలలో సింగపూర్ భాగస్వామ్యంపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. సింగపూర్‌లోని ఐటీఈ స్కిల్స్ ఫర్ ఫ్యూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్ అనే నినాదంతో 100 ఫుల్ టైమ్ కోర్సులకు ఆన్‌లైన్, క్యాంపస్ శిక్షణలు ఇస్తోంది.