Andhra PradeshHome Page Slider

‘సెల్ఫీ’తో లోకేష్‌కు  సవాల్ విసిరిన కేతిరెడ్డి

కృష్ణానది కరకట్టపై చంద్రబాబు ఇళ్లు ఎలా నిర్మించాడని సెల్ఫీ వీడియోతో సవాల్ విసిరారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. ‘గత ప్రభుత్వపు భూకబ్జాలు లోకేష్‌కి కనిపించలేదా’ అంటూ ఆరోపించారు. తన గెస్ట్‌హౌస్‌ని డ్రోన్‌తో షూటింగ్ చేసి వీడియోలో చూపిన లోకేష్‌కి కౌంటర్ ఇచ్చారు కేతిరెడ్డి.

నిన్న ధర్మవరంలో కేతిరెడ్డి ఫామ్‌హౌస్‌ని చూపిస్తూ, ‘గుడ్ మార్నింగ్’ కార్యక్రమంలో భూములు ఎక్కడున్నాయో చూసుకుంటూ కబ్జాలకు పాల్పడుతున్నాడని విమర్శించాడు లోకేష్. కోట్ల విలువ గల భూమిని, చెరువును ఆక్రమించిన ‘కేటుగాడు’ కేతిరెడ్డి అని పాదయాత్రలో పేర్కొన్నాడు లోకేష్. దీనికి కౌంటర్‌గా గతంలో సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు కృష్ణా కరకట్టపై కట్టిన బంగళా మాటేమిటని ప్రశ్నించాడు కేతిరెడ్డి.