విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని?
విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. విజయవాడ ఎంపీ అంటే నాకు ఎంతో ఇష్టమన్నారు కేశినేని నాని. సీఎం జగన్‌తో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నానన్నారు కేశినేని నాని. విజయవాడ పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించానన్నారు కేశినేని నాని. పార్టీ కోసం, ప్రజల కోసం నిజాయితీగా కష్టపడ్డానన్నారు. టీడీపీ కోసం సొంత వ్యాపారాలను పక్కనబెట్టేశానన్నారాయన. సొంత వ్యాపారాలకంటే పార్టీయే ముఖ్యమని భావించానన్నారు. బాబు పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలను భుజంపై మోశానన్నారు కేశినేని నాని. పార్టీ కోసం ప్రజల కోసం నిజాయితీగా కష్టపడ్డానన్నారు. చాలా మంది చెప్పినా తాను టీడీపీ కోసమే ఉన్నానన్నారు. నేను అమ్ముకున్న ఆస్తుల విలువ సుమారు 2 వేల కోట్లన్నారు.