Home Page SliderNational

37 దేశాల్లో రానున్న కేరళస్టోరీ- ఆదా ట్వీట్

రకరకాల కారణాలతో ఇప్పటికే ఎంతో ప్రచారం పొందింది కేరళ స్టోరీ మూవీ. దీనిని వెస్ట్‌బెంగాల్‌ రాష్ట్రంలో బ్యాన్ చేయగా, యూపీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో సబ్సిడీ ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నారు.  అదలా ఉంచితే, ఈ సినిమా నుండి కొత్త అప్‌డేట్ బయటకొచ్చింది. అదేంటంటే ఏకంగా 37 దేశాలలో ఈ సినిమా రిలీజ్ కాబోతోందట. ఈ విషయాన్ని స్వయంగా ఆసినిమాలో ముఖ్యపాత్ర ధరించిన హీరోయిన్ అదా శర్మ ట్విటర్‌లో పంచుకుంది.  ఈ సినిమాను ఆదరించిన,సక్సెస్ బాట పట్టించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. తమ సినిమాను చూసి, తన నటనను మెచ్చుకున్న కోట్లకొలది అభిమానులకు ధన్యవాదాలు చెపుతూ, ఈ సినిమాను మే 12వ తేదీన 37 దేశాలలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.