కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ అందని ద్రాక్షగా ఊరిస్తోంది. ఆయనకు మళ్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గురువారం సాయంత్రం ఆయనకు లక్ష రూపాయల పూచీకత్తుపై రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ మంజూరు అయ్యింది. అయితే సాక్ష్యులను ప్రభావితం చేయరాదని నిబంధనలు పెట్టారు. అయితే ఈ బెయిల్ మంజూరుపై స్టే విధించమని కోరుతూ ఈడీ హైకోర్టులో అప్పీలు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని, సీఎం బయటకు వెళితే తమ విచారణకు ఆటంకం కలుగుతుందని ఈడీ వాదించింది. వీరి వాదనలు విన్న హైకోర్టు బెయిల్‌పై స్టే విధించింది. కేజ్రీవాల్ బెయిల్‌ను స్వాగతిస్తూ ఇప్పటికే అప్ నేతలు సత్యమేవ జయతే అని సంబరాలు చేసుకున్నారు.