Home Page SliderNationalPolitics

ప్రధాని మోదీకి కేజ్రీవాల్ రిక్వెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల వేళ ప్రధాని మోదీకి, ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఒక లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ లేఖలో రాజధానిలో మెట్రో రైళ్లలో ప్రయాణించే విద్యార్థులకు 50 శాతం టికెట్ రాయితీని అమలు చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఈ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం సగం సగం భరించాలని ప్రతిపాదన చేశారు. ఢిల్లీలో అనేకమంది విద్యార్థులు మెట్రోపై ఆధారపడుతున్నారు. వారిపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ రాయితీని ప్రతిపాదిస్తున్నానని ఈ లేఖలో పేర్కొన్నారు. అలాగే తాము అధికారంలోకి వస్తే, విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు.