Home Page SliderNational

కేజ్రీవాల్‌కు మరోసారి కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం నుండి సీఎం కేజ్రీవాల్‌కు ఇంకా ఊరట లభించలేదు. ఈ స్కాంలో అరెస్టయిన కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఆగస్టు 27 వరకూ ఈ కస్టడీని పొడిగించారు. జూన్ 26న సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. మధ్యలో ఆయనకు ఈడీ కేసు నుండి బెయిల్ లభించినా సీబీఐ కేసు నుండి లభించలేదు. ఈ మధ్యనే ఇదే కేసులో గత 14 నెలలుగా జైలులో ఉన్నమాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సుప్రీంకోర్టు జోక్యంతో బెయిల్ లభించి, విడుదల అయ్యారు. మరోవైపు ఇదే కేసులో తీహార్ జైలులోనే ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కస్టడీని కూడా ఈనెల 27 వరకూ పొడిగించారు.