కేజ్రీవాల్‌పై విచారణలు షురూ..
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర ప్రభుత్వం విచారణలు షురూ చేసింది. ఇటీవల ఎన్నికలలో ఆప్ పరాజయం పొందడంతో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవకతవకలపై దృష్టి పెట్టింది కేంద్రం. కేజ్రీవాల్ అధికారిక బంగ్లా శీష్ మహల్ మరమ్మతుల కోసం భారీగా ఖర్చులు చేశారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఇటీవల ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కూడా ఈ విషయంపై విమర్శలు కురిపించారు. ఈ బంగ్లాను నిర్మించే క్రమంలో జరిగిన ఉల్లంఘనలను విచారించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రజా పనుల విభాగాన్ని కేంద్రం ఆదేశించింది. ఇది 8 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.

