ఢిల్లీ సీఎంగా మహిళకు అవకాశమిచ్చిన కేజ్రీవాల్
ఢిల్లీ సీఎంగా తప్పుకుంటానంటూ రెండ్రోజులు క్రితం ప్రకటించి అరవింద్ కేజ్రీవాల్ సంచలనం సృష్టించారు. అయితే ఆయన తర్వాత ఎవరు సీఎం పీఠం అధిరోహిస్తారా అన్న చర్చ ఢిల్లీ సర్కిళ్లు పెద్ద ఎత్తున జరిగింది. తాను అగ్నిపునీతం అయ్యాకే తిరిగి సీఎం పీఠం అధిరోహిస్తానంటూ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఇవాళ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో భేటీ అనంతరం పదవికి రాజీనామా చేస్తారు. ఆ తర్వాత ఢిల్లీ మంత్రి అతిషి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈరోజు జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభ్యుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈరోజు జరిగిన ఆప్ ఎమ్మెల్యేల సమావేశంలో ఆ పార్టీ నాయకుడు దిలీప్ పాండే ముఖ్యమంత్రిని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు. AAP జాతీయ కన్వీనర్ Ms Atishi పేరును ప్రతిపాదించినప్పుడు, AAP ఎమ్మెల్యేలందరూ లేచి నిలబడి దానిని ఆమోదించారు. అతిషిని శాసనసభా పక్ష నేతగా ఎన్నికైనట్లు వర్గాలు తెలిపాయి. అతిషి ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వంలో విద్య, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ వంటి కీలక పోర్ట్‌ఫోలియోలను కలిగి ఉన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి, రోడ్స్ స్కాలర్, అతిషి ఢిల్లీలోని పాఠశాలల్లో విద్యను మెరుగుపరచడంలో విస్తృతంగా పనిచేశారు.