‘కేజ్రీవాల్‌కు యమునానది శాపమే తగిలింది’…బీజేపీ ఎంపీ
కేజ్రీవాల్‌కు యమునానది శాపమే తగిలిందని, అందుకే ఓటమి పాలయ్యారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ పేర్కొన్నారు. కేజ్రీవాల్ పంజాబ్ పారిపోక తప్పదన్నారు. యమునా నదిని మా పార్టీ పరిశుభ్రంగా మారుస్తుంది. ప్రజలు ఎప్పుడైనా నదీ తీరాలకు వెళ్లేలా సౌకర్యాలు కలిగిస్తామంటూ ఆయన పేర్కొన్నారు. 20 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించే సామర్థ్యం ఉన్న వ్యక్తినే ముఖ్యమంత్రిగా నియమించే అవకాశముందని పేర్కొన్నారు. ఢిల్లీలో బీజేపీ విజయం ఖరారయ్యింది. కేజ్రీవాల్ ప్రజలకు ఎంతో ద్రోహం చేశారు. మంచినీళ్లకు బదులు మద్యం పంపిణీ చేశారు ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలు ప్రజలకు అందకుండా చేశారని మండిపడ్డారు. బీజేపీ తొలి కేబినెట్ సమావేశంలోనే ఆరోగ్య పథకాల అమలుపై దృష్టిసారిస్తుందని ఆయన పేర్కొన్నారు.

